లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్
- విడాకుల అంశంపై మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఆగ్రహం
- కంటెంట్ తొలగించకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక
- పరువు నష్టం దావా నోటీసు విడుదల చేసిన ఏఆర్ రెహమాన్ న్యాయవాది నర్మదా సంపత్
ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను పరస్పర అంగీకారంతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని తొలుత సైరా బాను తరపున న్యాయవాది వందనా షా మీడియాకు వెల్లడించగా, తర్వాత రెహమాన్ సైతం విడాకులపై ప్రకటన చేశారు. తమ జీవితంలో ఇది టఫ్ ఫేజ్ అని వారి ప్రకటనలో ఇద్దరూ పేర్కొన్నారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు తెలియాలని విడాకుల నిర్ణయం అధికారికంగా ప్రకటించామన్నారు. ఎంతో బాధతో తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని సైతం పేర్కొన్నా కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు.
తన క్లైయింట్కు సంబంధించి యూట్యూబ్, ట్విట్టర్ (ఎక్స్), ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఇతర ఆన్ లైన్ సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో చేసిన అసత్యప్రచారానికి సంబంధించి మొత్తం కంటెంట్ తొలగించాలని న్యాయవాది నర్మదా సంపత్ నోటీసులో పేర్కొన్నారు.