Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో యువకుడితో ప్రియురాలి అఫైర్... గిఫ్ట్‌గా ఇచ్చిన స్కూటీని లాక్కున్న పాత ప్రియుడు... వీడియో ఇదిగో!

Boyfriend catches girlfriend cheating and takes back gifted scooty
Advertisement
  • చాలా ఏళ్లుగా రిలేషన్‌లో యువతీయువకుడు
  • ఈ క్రమంలో ఆమెకు స్కూటీ కొనిచ్చిన ప్రియుడు
  • ఆ తర్వాత అతడిని మోసం చేస్తూ మరో యువకుడితో ప్రేమ
  • రోడ్డుపై అడ్డుకుని ప్రియురాలు, ఆమె కొత్త ప్రియుడిని నిలదీసిన వైనం
  • చివరికి స్కూటీ తీసుకుని వెళ్లిపోయిన పాత ప్రియుడు
Advertisement
తనను మోసం చేస్తూ మరో యువకుడితో తిరుగుతున్న ప్రియురాలిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రియుడు తాను గిఫ్ట్‌గా ఇచ్చిన స్కూటీని ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గాళ్‌ఫ్రెండ్‌ను, ఆమె కొత్త ప్రియుడిని నడిరోడ్డుపై పట్టుకుని కడిగి పారేసిన యువకుడు ఎట్టకేలకు తన స్కూటీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

వైరల్ అవుతున్న వీడియోలో.. యువతి స్కూటీని ఆపిన ఆమె పాత ప్రియుడు బండి తాళాలు లాక్కున్నాడు. రోడ్డు మధ్యలో ఈ నాన్సెన్స్ ఏంటని, పక్కకి తప్పుకోవాలని యువతి కొత్త ప్రియుడు పాత ప్రియుడిని నిలదీశాడు. మరోవైపు, ఆమె పదేపదే తాళాలు ఇవ్వాలని కోరడం కనిపించింది. ఈ క్రమంలో ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడిన పాత ప్రియుడు అనంతరం ఆమె జత్తు పట్టుకునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న యువకుడు అడ్డుకున్నాడు. 

ఆ తర్వాత ఆమె స్కూటీ దిగగా పాత ప్రియుడు దానిని రోడ్డు పక్కకు తీసుకొచ్చాడు. అప్పటికీ ఆమె తాళాలు అడుగుతుండటంతో సహనం కోల్పోయిన యువకుడు ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో రోడ్డుపై వెళ్తున్న వారు గుమికూడారు. ఆమెపై ఎందుకు చేయిచేసుకున్నావన్న వారి ప్రశ్నకు పాత ప్రియుడు ఏం జరిగిందో వివరించాడు.

 తాము చాలా ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఈ క్రమంలోనే ఆమెకు స్కూటీని గిఫ్ట్‌గా ఇచ్చినట్టు తెలిపాడు. ఇటీవల ఆమె తనను మోసం చేస్తున్న విషయాన్ని గమనించానని చెప్పాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన లభించింది. ఆ జంటను నడిరోడ్డుపై అవమానించడాన్ని కొందరు విమర్శించగా, మరికొందరు అతడికి సానుభూతి తెలపడంతో పాటు రోడ్డు మధ్యన అడ్డుకుని నిలదీసిన అతడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కాగా, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. అయితే, వారంతా హిందీలో మాట్లాడుతుండడంతో ఉత్తర భారతదేశంలోనే ఎక్కడో జరిగి ఉంటుందని తెలుస్తోంది.
Advertisement
Advertisement
Viral Video
Boyfriend
Girlfriend Cheating
Scooty

More Telugu News