ఇండియా ఆలౌట్... బుమ్రా దెబ్బకు విలవిల్లాడుతున్న ఆస్ట్రేలియా
- 150 పరుగులకు ఇండియా ఆలౌట్
- 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన నితీశ్ రెడ్డి
- 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా తడబడుతోంది. 31 పరుగులకే ఆసీస్ 4 వికెట్లను కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా (8), మెక్ స్వీనీ (10), స్మిత్ (0) పెవిలియన్ చేరారు. వీరు ముగ్గురినీ బుమ్రా ఔట్ చేశాడు. 11 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను కొత్త బౌలర్ హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 33 పరుగులు. లబుషేన్ (1 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.