Peddireddi Ramachandra Reddy: పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అదనపు బాధ్యతలను అప్పగించిన జగన్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు వైసీపీ అధినేత జగన్ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ గా బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ గా బాధ్యతలను అప్పగించారు.