Allu Arjun: అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత

YSRCP leader Shilpa Ravi wishes to Allu Arjun
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఇటీవలే బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఈవెంట్ నిర్వహించి సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇలాంటి ఈవెంట్లనే దేశ వ్యాప్తంగా ప్లాన్ చేశారు.

మరోవైపు సినిమా రిలీజ్ అవబోతున్న తరుణంలో అల్లు అర్జున్ కు ఆయన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. 'పుష్ప 2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బన్నీ స్పందించారు. "థాంక్యూ సో మచ్" అని రిప్లై ఇచ్చారు. 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల నుంచి పోటీ చేసిన శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే. నంద్యాలలోని రవి ఇంటికి బన్నీ వెళ్లారు. ఆ పర్యటన వివాదాస్పదమయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు కూడా పెట్టారు.

మరోవైపు, 'పుష్ప 2'లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. జగపతి బాబు, అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Go Back to Shorts
Allu Arjun
Tollywood
Shilpa Ravi
YSRCP

More Telugu News