తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు
- తూర్పువైపు ప్రధాన ద్వారాన్ని మూసివేస్తున్న ప్రభుత్వం
- తలుపులు తొలగించి రేకులతో క్లోజ్ చేస్తున్న ప్రభుత్వం
- ఈశాన్యం గేటుకు తూర్పు వైపుకు రానున్న ప్రధాన ద్వారం
దాదాపు రూ.3.20 కోట్లతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపేవారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలను కొంతకాలం నిలిపేశారు. ఆ దారిలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును కూడా వేస్తున్నారు.
పశ్చిమం వైపు మింట్ కాంపౌండ్ ఉంది. ఈ ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగించడం లేదు. ఇక్కడ ఎలాంటి మార్పులూ చేయడం లేదు. సచివాలయం నిర్మాణం తర్వాత మార్పులు చేయడం ఇదే తొలిసారి. కొత్త సచివాలయ భవనాన్ని నాటి సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించారు.