Pushpa 2: పుష్ప-2 ట్రైలర్‌పై దర్శకుడు రాజమౌళి స్పందన ఇదే

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా రూపుదిద్దుకున్న ‘పుష్ప-2 ది రూల్’ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను బీహార్ రాజధాని నగరం పాట్నాలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా నిర్వహించారు. సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేసిన ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వస్తోంది.

అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పుష్ప-2 ట్రైలర్‌పై దర్శకధీరుడు రాజమౌళి కూడా స్పందించారు. ‘‘పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది!! దేశమంతటా విస్తరిస్తోంది!! డిసెంబర్ 5న పేలుతుంది!! పార్టీ కోసం వేచిచూడలేను పుష్ప!!’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

కాగా పుష్ప2 ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా... ఇంటర్నేషనలు...!’, ‘పుష్ప అంటే ఫైరు కాదు.... వైల్డ్ ఫైరు’ వంటి డైలాగులతో పాటు ఇతర పంచ్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక 2021 చివర్లో వచ్చి దుమ్మురేపిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే.
Pushpa 2
Rajamouli
Allu Arjun
Rashmika Mandanna
Pushpa 2 Trailer
Tollywood
Movie News

More Telugu News