Nayanthara: విఘ్నేశ్ శివన్ తో తాను ఎలా ప్రేమలో పడిందీ వెల్లడించిన నయనతార

Nayanthara reveals how she fall in love with Vighnesh Shivan
షార్ట్స్‌లో చూడండి
సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకునే నటి నయనతార. నయనతార... తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినీ కపుల్ 2022 జూన్ 9న ఒక్కటయ్యారు. నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు సరోగసీ విధానంలో  కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. 

తాజాగా, నయనతార ప్రస్థానంపై ఓ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది.  ఈ డాక్యు ఫిలిం పేరు నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్. ఈ డాక్యుమెంటరీ చిత్రం నుంచి మేకర్స్ చిన్న వీడియో క్లిప్ ను విడుదల చేశారు. ఇందులో నయనతార, విఘ్నేశ్ శివన్... తామిద్దరం ఒకరితో ఒకరు ఎలా ప్రేమలో పడిందీ వివరించారు. 

నయనతార మాట్లాడుతూ... అప్పుడు పుదుచ్చేరిలో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాను. ఆ సమయంలో విఘ్నేశ్... విజయ్ సేతుపతి సర్ పై ఓ షాట్ తీశాడు. ఆ సమయంలో నా షాట్ కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉన్న రోడ్డుపై కూర్చున్నాను. ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ, విఘ్నేశ్ వైపు చూశాను. ఏదో కొత్త ఫీలింగ్ కలిగింది. ఎంతో ముద్దుగా ఉన్నాడు అనిపించింది. సీన్ గురించి అతడు వివరించే విధానం కూడా ముచ్చటగా ఉంటుంది. దర్శకుడిగా ఓ సినిమాను తెరకెక్కించే పద్ధతి కూడా అంతే అందంగా ఉంటుంది" అని వెల్లడించారు. 

విఘ్నేశ్ మాట్లాడుతూ... "ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత... సెట్స్ పై మిమ్మల్ని మిస్సవుతున్నాను అని నయనతార చెప్పింది. నేను కూడా మిమ్మల్ని మిస్సవుతున్నాను అని రిప్లయ్ ఇచ్చాను. నేను అబద్ధం చెప్పడంలేదు. ఏ అబ్బాయి అయినా సరే... చక్కగా ఉన్న అమ్మాయిని చూస్తే... అరె, చాలా బాగుంది అని మనసులో మెచ్చుకుంటాడు. కానీ, నయన్ మేడమ్ ను నేను ఆ దృష్టితో మాత్రం ఎప్పుడూ చూడలేదు" అని వివరించారు. 

నయనతార స్పందిస్తూ... "రిలేషన్ కు సంబంధించి నేను ముందడుగు వేయడం అదే ప్రథమం. అప్పటినుంచి మా మధ్య మాటలు గతంలో కంటే వేరే విధంగా ఉండబోతున్నాయన్న విషయం మాకు అర్థమైంది" అని వివరించారు. 

విజయ్ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 2015లో నానుమ్ రౌడీ దాన్ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా సమయంలోనే తామిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని నయనతార, విఘ్నేశ్ తాజాగా డాక్యుమెంటరీలో వెల్లడించారు. ఈ డాక్యుమెంటరీ నవంబరు 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
Go Back to Shorts
Nayanthara
Vighnesh Shivan
Love
Wedding
Kollywood

More Telugu News