ఎస్ఐ తల పగలకొట్టిన గంజాయి బ్యాచ్.. హైదరాబాద్ లో ఘటన
- అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై దాడి
- బీర్ బాటిల్ తో కొట్టిన పాత నేరస్తుడు
- ఆసుపత్రిలో చేరిన హబీబ్ నగర్ ఎస్ఐ శివకుమార్
సీఐలు దీపక్, రాజశేఖర్, ఎస్ఐ శివకుమార్ తో పాటు కొంతమంది కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారు. అయితే, వీరి రాకను గుర్తించిన పాత నేరస్తుడు, గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంటపడి దీపక్ ను పట్టుకున్నారు. స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులతో కలిసి దీపక్ తమ్ముడు అరుణ్ పోలీసులను అడ్డుకున్నాడు.
దాదాపు వంద మంది పోలీసులపై దాడికి దిగారు. బీర్ బాటిల్ తో కొట్టడంతో ఎస్ఐ శివకుమార్ తలపై గాయమైంది. స్థానికుల దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు.. ఎస్ఐ శివకుమార్ ను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో ఎస్ఐ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు పోయిందని పోలీసులు తెలిపారు. గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్, అతడి తమ్ముడు పరారయ్యారని వివరించారు.