ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు స్థానచలనం

AP Govt transfers IAS officials
  • ఆర్థిక శాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రాస్
  • పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కె.కన్నబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు
  • వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా డి.హరిత 
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కె.కన్నబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా డి.హరితను నియమించారు. 

ఇటీవలే తెలంగాణ నుంచి రిలీవ్ అయిన రొనాల్డ్ రాస్ ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీగా బి. అనిల్ కుమార్ రెడ్డి... లేబర్, ఫ్యాక్టరీలు, బాయిలర్లు ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అడిషనల్ సెక్రటరీగా గంధం చంద్రుడును నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Go Back to Shorts
IAS
Transfer
AP Govt

More Telugu News