సిటీలో మరో 50 మందికి హైడ్రా నోటీసులు
- ప్రభుత్వ స్థలాల కబ్జాపై సీరియస్
- 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని వార్నింగ్
- ఆ తర్వాత కూల్చివేతలు చేపడతామని వెల్లడి
హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించి ఫుల్ టాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్), బఫర్ జోన్ల బౌండరీలను నిర్ధారించే పనిలో హైడ్రా అధికారులు తలమునకలుగా ఉన్నారు. అదే సమయంలో ఆక్రమణదారులపైనా దృష్టి సారించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమణదారుల నుంచి కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వారం రోజులుగా కబ్జాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రోడ్ల పక్క ప్రభుత్వ స్థలాలు, ఫుట్ పాత్ లు, పార్కు స్థలాలను ఆక్రమించిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.