ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా
- నేడు విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్
- ఈ నెల 4న విడుదలైన ఏపీ టెట్ ఫలితాలు
- డీఎస్సీ ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ
ఏపీ టెట్ ఫలితాల తర్వాత రెండు రోజుల వ్యవధిలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని ముందుగా పాఠశాల విద్యాశాఖ సమాచారం ఇచ్చింది. ఈ నెల 4వ తేదీ సోమవారం ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేశారు. దీంతో ఈరోజు (బుధవారం,6వ తేదీ) మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది.