సంప్రదాయం ప్రకారం అర్ధరాత్రి ఓటేసిన ఆరుగురు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ షురూ
- న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని చిన్న పట్టణంలో మొదలైన ఓటింగ్ ప్రక్రియ
- అర్ధరాత్రి సమయంలో ఓటు వేసిన ఆరుగురు రిజిస్టర్డ్ ఓటర్లు
- ట్రంప్, కమలా హారిస్‌లకు చెరో మూడు ఓట్లు వేసిన ఓటర్లు
ట్రంప్‌కు 3 ఓట్లు.. హారిస్‌కు 3 ఓట్లు
ఇక్కడ ఈసారి ఓటు వేసిన ఆరుగురులో ముగ్గురు కమలా హారిస్‌కు, మరో ముగ్గురు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేశారు. ఈ పరిణామం చూస్తుంటే ఈసారి అమెరికా ఎన్నికల్లో ఎంత గట్టి పోటీ ఉందో అర్థం అవుతోందని, దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపించే అవకాశం ఉందని అమెరికా రాజకీయ వర్గాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈసారి ఇక్కడ ఓటు వేసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. కమలా హారిస్‌కు ఓటు వేశానని చెప్పాడు. ‘‘నేను ప్రెసిడెంట్ కోసం పనిచేస్తే.. అధ్యక్షుడు నా కోసం పనిచేయాలి’’ అని, ట్రంప్‌కు ఓటు వేయకపోవడానికి అతిపెద్ద కారణం ఇదేనని అన్నాడు. ఓటు వేయనంత మాత్రాన ట్రంప్‌కు శత్రువుని కాదని వ్యాఖ్యానించాడు.