Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వందల కోట్లు సంపాదించలేదుగానీ .. సినీ నటి వై.విజయ!

Y Vijaya Interview
Advertisement
  • 'పులుసు' పాత్ర గురించి ప్రస్తావించిన వై. విజయ
  • ఆ పాత్రతో సినిమాల సంఖ్య పెరిగిందని వెల్లడి
  • ఆ పాత్ర స్థలం .. ఇల్లు తెచ్చిపెట్టిందని వివరణ  
  • తన పారితోషికం పెంచలేదని వ్యాఖ్య

Advertisement
వై.విజయ .. తనదైన రూట్లో ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతూ వెళ్లిన నటి. సుదీర్ఘ కాలంగా ఆమె తన కెరియర్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చాను. కెరియర్ ఆరంభంలోనే హీరోయిన్ గా చేశాను. ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాను" అని చెప్పారు.  

"మా పల్లెలో గోపాలుడు' సినిమాలో నేను చేసిన 'పులుసు' పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తరువాత మా ఇంట్లో ఫోన్ అలా మోగుతూనే ఉండేది. రోజుకి ఐదు ఆఫర్లు వచ్చేవి. ఆ ఏడాది నేను చేసిన సినిమాల సంఖ్య ఎక్కువ. ఆ సినిమాల డబ్బుతో నేను చెన్నైలో స్థలం కొన్నాను .. ఇల్లు కట్టాను. తెలుగు నిర్మాతలు నాకు వరుసగా అవకాశాలు ఇవ్వడం వల్లనే అది సాధ్యమైంది" అని అన్నారు. 

"మా పల్లెలో గోపాలుడు' తరువాత నేను చేసిన సినిమాల సంఖ్య పెరిగింది. కానీ నేను నా పారితోషికం పెంచలేదు. నిర్మాతలను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నేను వందల కోట్లు సంపాదించి ఉంటానని అనుకుంటున్నారు. పెట్టుబడులు ఎక్కువగా పెడుతూ వెళితే ఉండేవేమో. కానీ మేము అలా చేయలేదు. స్థిరాస్థులు సంపాదించుకున్నాము .. డబ్బుకు ఇబ్బంది లేకుండా .. ఎవరినీ అప్పు అడిగే పరిస్థితి రాకుండా చూసుకున్నాం .. అది చాలు" అని అన్నారు.  

Advertisement
Advertisement
Y Vijaya
Actress
Tollywood

More Telugu News