Kapil Dev: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇవాళ విజయవాడ వచ్చిన కపిల్ దేవ్... స్థానిక ఎంపీ, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లి తరలి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతిలో గోల్ఫ్ కోర్స్, క్లబ్ ఏర్పాటుపై చర్చించినట్టు సమాచారం. 

క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కపిల్ దేవ్... గోల్ఫ్ వైపు మళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా, ఏపీ రాజధాని అమరావతిలో గోల్ఫ్ మైదానం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. 

చంద్రబాబు అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో గోల్ఫ్ కోర్స్ కూడా అమరావతికి ఒక అదనపు ఆభరణం అవుతుందని భావిస్తున్నారు.

కాగా, గన్నవరం ఎయిర్ పోర్టులో కపిల్ దేవ్ కు ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. 
Kapil Dev
Chandrababu
Golf Course
Amaravati
Andhra Pradesh

More Telugu News