ఆసీస్ లెజెండ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun wishes David Warner on his birthday
  • నేడు డేవిడ్ వార్నర్ పుట్టినరోజు
  • నా సోదరుడు అంటూ స్పందించిన అల్లు అర్జున్
  • ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలంటూ ఆకాంక్ష
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ తెలుగు చిత్రసీమను ఎంతగా అభిమానిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పుష్ప మేనరిజం వీడియోలతో వార్నర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. అంతేకాదు, అల్లు అర్జున్ కు అభిమాన క్రికెటర్ గా మారిపోయాడు. 

ఈ నేపథ్యంలో, ఇవాళ వార్నర్ పుట్టినరోజు కాగా.... అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. డేవిడ్ వార్నర్ ఫొటో పంచుకున్న అల్లు అర్జున్... "నా సోదరుడు డేవిడ్ వార్నర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి" అంటూ రాసుకొచ్చారు.
Advertisement
Allu Arjun
David Warner
Birthday
Australia
Tollywood

More Telugu News