పాకిస్థాన్‌కు చెందిన కొత్త ఉగ్రవాద గ్రూపును తుదముట్టించిన జమ్మూకశ్మీర్ సీఐకే
- ఆదివారం ఒక డాక్టర్, ఆరుగురు వలస కూలీలను హత్య చేసిన ఉగ్రవాదులు
- పలు జిల్లాల్లో మేజర్ ఆపరేషన్ నిర్వహించిన జమ్మూకశ్మీర్ పోలీసులు
- లష్కరే సంస్థకు చెందిన ‘తెహ్రీక్ లబైక్ య ముస్లిం’ నామరూపాల్లేకుండా చేసిన పోలీసులు
ఈ సందర్భంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన శాఖ ‘తెహ్రీక్ లబైక్ య ముస్లిం’ (టీఎల్ఎం)ను నామరూపాల్లేకుండా చేశారు. ఈ సంస్థను పాకిస్థాన్ నుంచి ‘బాబా హమాస్’ అనే వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం గండెర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు ఒక డాక్టర్, ఆరుగురు వలస కార్మికులను హత్య చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.