కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం
- ఆదివారం ఉదయం బెంగళూరులో మృతి
- సంతాపం తెలియజేస్తున్న అభిమానులు, సినీ పరిశ్రమ
- సుదీప్ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన పవన్‌కల్యాణ్
సుదీప్ తల్లి మరణవార్త తెలుసుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్‌కల్యాణ్ తన సంతాపాన్నితెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ''ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మాతృమూర్తి కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని సుదీప్ ఎన్నోసార్లు తెలిపారు. మాతృవియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని పవన్‌కల్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.