విమానంలో సినిమా ప్రమోషన్స్.. యువనటి వీడియో వైరల్!
- చంద్ర కృష్ణ, అనన్య జంటగా 'పొట్టేల్' మూవీ
- ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
- చిత్రం యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీ
- తాము ప్రయాణించిన విమానంలో సినిమా పోస్టర్లు పంచిపెట్టిన చిత్ర బృందం
దీనిలో భాగంగా చిత్ర బృందం తాము ప్రయాణిస్తున్న విమానంలో సినిమా ప్రమోషన్స్ చేశారు. విమానంలోని ప్రయాణికులకు పొట్టేల్ మూవీ పోస్టర్లను పంచిపెట్టారు. దర్శకుడు సాహిత్, హీరోహీరోయిన్లు చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ఇలా ప్రయాణికులకు మూవీ తాలూకు కరపత్రాలు పంచిపెడుతూ వారితో ముచ్చటించారు.
ఇలా విమానంలో మూవీ ప్రచారం చేసిన వీడియోను అనన్య తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. 'ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం' అనే క్యాప్షన్‌తో ప్రమోషన్స్ వీడియోను ఆమె షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.