AP Govt: టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు సీఐడీకి అప్పగింత

AP Govt decides to hand over cases of attacks on TDP office and Chandrababu residence
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తోంది. ఈ కేసుల విచారణ వేగవంతం చేయడానికి సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో, ఈ కేసుల విచారణను సీఐడీకి బదిలీ చేయనున్నారు. రేపు (అక్టోబరు 14) ఈ కేసుల ఫైళ్లను మంగళగిరి డీఎస్పీ సీఐడీకి అప్పగించనున్నారు.
Go Back to Shorts
AP Govt
TDP Office
Chandrababu Residence
Attack
CID
TDP-JanaSena-BJP Alliance

More Telugu News