పాక్‌లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన ఉగ్రవాదులు
- బలూచిస్థాన్ ప్రావిన్సులో ఘటన
- జునైద్ కోల్ కంపెనీ గనిలో ఉగ్రవాదుల దుశ్చర్య
- మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్ జాతీయులు
మృతుల్లో ఎక్కువమంది బలూచిస్థాన్ ప్రావిన్సులోని పష్తున్ ప్రాంతానికి చెందినవారే. అలాగే, మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవారున్నారు. వచ్చే వారం ఇస్లామాబాద్‌లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. కాగా, బలూచిస్థాన్‌లో ఎక్కువగా తెహ్రీక్ -ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తరచూ ఉగ్రదాడులకు దిగుతూ ఉంటుంది. ఈ ఘటన కూడా దాని పనేనని అనుమానిస్తున్నారు.