వ్యాపార రంగంలో రతన్ టాటా వంటి వారు ఎంతో అరుదు: సీఎం చంద్రబాబు

10-10-2024 Thu 17:08 | Andhra
Advertisement
  • ముంబయిలో రతన్ టాటా భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు
  • ఆయనతో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న ఏపీ సీఎం
  • డబ్బు సంపాదించడమే కాకుండా, ఆ డబ్బును ప్రజలకు ఖర్చు చేశారని వెల్లడి
Advertisement
ముంబయిలో రతన్ టాటా భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ తో కలిసి ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్దకు విచ్చేసిన చంద్రబాబు... రతన్ టాటా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ మహోన్నత వ్యాపారవేత్తతో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. 

రతన్ టాటా ఒక అద్భుతమైన వ్యక్తి అని అభివర్ణించారు. ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు. ఆయన ఎల్లప్పుడూ దేశం గురించే మాట్లాడేవారని, తన చేతల ద్వారానూ ఆ విషయాన్ని నిరూపించుకున్నారని చంద్రబాబు వివరించారు. 

వ్యాపార రంగంలో రతన్ టాటా వంటి వారు అరుదుగా కనిపిస్తుంటారని పేర్కొన్నారు. ఓవైపు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూనే, మరోవైపు తన జీవితాంతం సామాజిక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ప్రపంచ ముఖచిత్రంపై భారత్ కనిపించేలా చేశారని, ఓ పారిశ్రామికవేత్తగా ఆయనకు అమోఘమైన విజన్ ఉందని చంద్రబాబు తెలిపారు. 

100 దేశాల్లో టాటా గ్రూపు విస్తరించిందంటే అందుకు రతన్ టాటా కార్యదీక్షే కారణమని అన్నారు. ఏ అంశంలో చూసినా ఏదో ఒక టాటా సంస్థ కనిపిస్తుందని, రతన్ టాటా గొప్పదనం గురించి వివరించడానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. 

డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకోకుండా, నైతిక బాధ్యతగా ఆ డబ్బును ప్రజల కోసం ఖర్చు చేయడం రతన్ టాటా మంచి మనసును చాటుతుందని వివరించారు. తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించాలని కోరితే, వెంటనే ఆ పని చేశారని చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా ఆర్థికసాయం చేశారని తెలిపారు. 

రతన్ టాటా భావజాలం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు. యావత్ పారిశ్రామిక రంగాన్ని ఒక వ్యక్తి ఎలా మార్చివేశాడన్న దానికి రతన్ టాటానే ఉదాహరణ అని కీర్తించారు. అటువంటి  మహనీయుడైన రతన్ టాటా మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఘనతర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.
Advertisement
Ratan TataChandrababuIntimacyMumbaiAndhra Pradesh

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more