విశాఖ సాగరతీరానికి టీసీఎస్ హారం... టాటా గ్రూప్‌ని ఒప్పించి రప్పించిన మంత్రి లోకేశ్

09-10-2024 Wed 20:22 | Andhra
Advertisement
  • టీసీఎస్ విశాఖ ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు
  • ముంబైలో టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎం. చంద్ర‌శేఖ‌ర‌న్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ
  • ఈవీ, ఎయిరో స్పేస్‌, స్టీల్, టూరిజం రంగాల్లో పెట్టుబ‌డుల అవ‌కాశాలూ ప‌రిశీలిస్తామ‌న్న టాటా గ్రూప్
  • లులూ, ఒబెరాయ్‌, బ్రూక్ ఫీల్డ్‌, సుజ‌లాన్ తర్వాత ఏపీకి భారీ గిఫ్ట్‌గా టీసీఎస్‌ను తెచ్చిన లోకేశ్
  • ఐటీ హ‌బ్‌గా విశాఖ‌, ప్ర‌ఖ్యాత కంపెనీల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా మార‌నున్న ఏపీ
Advertisement
అందాల విశాఖ సాగ‌ర‌తీరంలో టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ మ‌ణిహారంగా మెర‌వ‌నుంది. మెరుగైన జీత‌భ‌త్యాలు అందిస్తూ... 10 వేల ఐటీ ఉద్యోగాలు యువ‌త‌కు ల‌భించ‌నున్నాయి. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో యువ‌నేత, మంత్రి నారా లోకేశ్ ఏపీకి ప్ర‌ఖ్యాత ఐటీ కంపెనీలను ర‌ప్పించి ల‌క్ష‌లాది మందికి స్థానికంగా ఉపాధి క‌ల్పిస్తాన‌ని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెర‌వేర్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసి టాటా గ్రూప్ చైర్మ‌న్‌, పెద్ద‌ల‌ను ఒప్పించి విశాఖ‌కు టీసీఎస్‌ని ర‌ప్పించారు. 

ముంబై మ‌హాన‌గ‌రంలోని టాటా స‌న్స్ ఆఫీస్ బాంబే హౌస్‌లో టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎం. చంద్ర‌శేఖ‌ర‌న్‌తో నిన్న ఏపీ ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎంవో అడిష‌నల్ సెక్ర‌ట‌రీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు పాల్గొన్నారు.

ఏపీ ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు, విశాఖ‌లో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌లను మంత్రి లోకేశ్ వారికి వివ‌రించారు. త‌మ టీసీఎస్ సెంట‌ర్‌ను విశాఖ‌లో నెల‌కొల్పుతామ‌ని, 10 వేల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని టాటా గ్రూప్ ప్ర‌క‌టించింది. ఏపీలో ఈవీ, ఎయిరో స్పేస్‌, స్టీల్, హోట‌ల్స్, టూరిజం రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశాలు ప‌రిశీలిస్తామ‌ని మంత్రి నారా లోకేశ్‌కు టాటా గ్రూప్ తెలిపింది.

నారా లోకేశ్ హర్షం

టీసీఎస్ ఏర్పాటుపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖ‌లో ఏర్పాటు చేసి 10,000 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్ర‌ఖ్యాత కంపెనీల‌ను స్వాగతిస్తోందని తెలిపారు. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా నిలిపేందుకు టీసీఎస్ వంటి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీ పెట్టుబ‌డి తొలి అడుగు కానుంద‌ని హ‌ర్షం వ్యక్తం చేశారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో దూసుకెళ్తామ‌ని ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు ప్రకటించారు. సీఎం ఆదేశాల‌తో, తాను యువ‌త‌కి-రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన మాట మేర‌కు మంత్రి నారా లోకేశ్ ప్ర‌ఖ్యాత కంపెనీల‌ను ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేసి విజ‌య‌వంతమయ్యారు. లులూ, ఒబెరాయ్‌, బ్రూక్ ఫీల్డ్‌, సుజ‌లాన్ ఇప్ప‌టికే ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పుడు లోకేశ్ ఐటీ అభివృద్ధిలో గేమ్ ఛేంజ‌ర్ కానున్న టాటా గ్రూప్‌ని ఒప్పించి... మెప్పించి టీసీఎస్ ర‌ప్పించారు. టీసీఎస్ రాక‌తో ఐటీ హ‌బ్‌గా విశాఖ‌... ప్ర‌ఖ్యాత కంపెనీల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా ఆంధ్రప్రదేశ్ మారనుంది.
Advertisement
TCSNara LokeshAndhra Pradesh

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more