Balakrishna: బాలకృష్ణ, అల్లు అర్జున్‌ల అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తి

Balakrishna Allu Arjun Unstoppable episode shooting complete
షార్ట్స్‌లో చూడండి
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా రూపొందుతున్న కార్యక్రమం అన్‌స్టాపబుల్‌. బుల్లితెరపై ఇది సంచలన కార్యక్రమంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షో రెండు సీజన్‌లను పూర్తి చేసుకుంది. త్వరలో మూడో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంతో బాలకృష్ణకు వచ్చిన కొత్త ఇమేజ్‌ అంతా ఇంతా కాదు. ఇంటిల్లిపాది ఆయన అన్‌స్టాపబుల్‌ కార్యక్రమాన్ని ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. 

ఈ మూడో సీజన్‌లో యువ కథానాయకుడు అల్లు అర్జున్‌తో ఓ ఎపిసోడ్‌ను షూట్‌ చేశారు. ఈరోజు దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. ఈ కార్యక్రమానికి వచ్చే గెస్ట్ ల చేత పలు వివాదాస్పద ప్రశ్నలకు బాలయ్య సమాధానాలు చెప్పిస్తుంటారు. అప్పటి వరకు ఎవరికి తెలియని రహస్యాలను కూడా ఈ 'ఆహా' కార్యక్రమంలో బాలకృష్ణ చెప్పిస్తుంటారు. 

తాజాగా జరిగిన అల్లు అర్జున్‌ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌లో ఎన్నో ప్రశ్నలకు బన్నీ నుండి సమాధానాలు రాబట్టారని తెలిసింది. ముఖ్యంగా అందరిలో వున్న కొన్ని సందేహాలకు కూడా ఆయన ఈ ఎపిసోడ్‌లో సమాధానాలు ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌తో బన్నీ అనుబంధం, నంద్యాల ఎపిసోడ్‌తో పాటు పుష్ప-2 చిత్రం గురించి విశేషాలను ఈ ఎపిసోడ్‌లో చూడొచ్చని అల్లు అర్జున్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

అయితే గతంలో దర్శకుడు సుకుమార్‌తో అన్‌స్టాపబుల్‌ జరిగినప్పుడు అల్లు అర్జున్‌ గెస్ట్‌గా వచ్చి కాసేపు అలరించాడు. బన్నీతో జరిగిన ఈ ఎపిసోడ్‌ లో పలువురు సర్ ప్రైజింగ్ గెస్ట్‌లు కూడా వున్నారని టాక్‌.

Go Back to Shorts
Balakrishna
Allu Arjun
Unstoppable
Pushpa
pushpa2

More Telugu News