Konda Surekha: కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు... ఆ వివాదం ముగిసింది: మంత్రి పొన్నం ప్రభాకర్

ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల అంశాన్ని ప్రస్తావించడం తీవ్ర దుమారం రేగింది. సినీ పరిశ్రమ యావత్తు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది.

అయితే, కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమకు చెందిన వారు ఇంకా స్పందిస్తూనే ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు... ఆ వివాదం అంతటితో ముగిసింది... సినీ పరిశ్రమ వ్యక్తులు ఇంకా దానిపై మాట్లాడుతూనే ఉండడం సరికాదు అని అభిప్రాయపడ్డారు. 

బలహీన వర్గానికి చెందిన మహిళా మంత్రి ఒంటరి అనుకోవద్దు... కొండా సురేఖ విషయంలో సంయమనం పాటించాలి అని పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Konda Surekha
Akkineni Family
Ponnam Prabhakar
Congress
Tollywood
Telangana

More Telugu News