రామ్ చరణ్ తో ఫ్లాప్ మూవీ తీసిన డైరెక్టర్ తో సూర్య బాలీవుడ్ ఎంట్రీ!

Surya to act in Bollywood movie
షార్ట్స్‌లో చూడండి
కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. విభిన్న కథలు, తనదైన యాక్టింగ్ స్టైల్ తో సూర్య ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. సూర్య తాజా చిత్రం 'కంగువ' ఎనిమిది భాషల్లో నవంబర్ 14న విడుదల కాబోతోంది. 

మరోవైపు, సూర్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహాభారతం కథాంశంతో సీనియర్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. కర్ణుడి పాత్రలో సూర్య నటించబోతున్నారని టాక్. ఈ మూవీలో సూర్యతో పాటు పలువురు బాలీవుడ్ యాక్టర్లు నటించబోతున్నారు. సూర్య సరసన జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. 

కాగా, గతంలో రామ్ చరణ్ కు బాలీవుడ్ లో రాకేశ్ ఓంప్రకాశ్ ఫ్లాప్ ఇచ్చారు. చరణ్ తో రాకేశ్ తెరకెక్కించిన 'తుఫాన్' చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Surya
Bollywood

More Telugu News