తిరుమల మెట్ల మార్గంలో మరోసారి కలకలం రేపిన చిరుత
- శనివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు వచ్చిన చిరుత
- చిరుతను వెంబడించిన కుక్కలు
- భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది
గత ఏడాది మెట్ల మార్గంలో ఓ బాలికపై చిరుత దాడి చేయడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో మెట్ల మార్గంలో టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఆంక్షలను విధించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు కొన్ని చిరుతలను పట్టుకుని జూలో వదిలేశారు.
తాజాగా మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు ఓ చిరుత వచ్చింది. చిరుతను గమనించిన కుక్కలు దాన్ని వెంబడించాయి. సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు.