Mahesh babu: రాజమౌళి సినిమాలో మహేశ్ లుక్‌ ఇది కాదా?

Isnt this Maheshs look in Rajamoulis movie
షార్ట్స్‌లో చూడండి
అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి ఏ సినిమా చేసినా, ఏ హీరోతో చేసినా అది సెన్సేషనే. తెలుగు సినిమాను ఖండాంతరాలు దాటించిన ఈ దర్శకధీరుడు తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అడ్వెంచరస్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా.. ఇండియానా జోన్స్‌ తరహాలో రూపొందనున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు లుక్‌ చాలా వైవిధ్యంగా వుండబోతోంది. మునుపెన్నడూ చూడని రీతిలో ఈ చిత్రంలో ఈ ఘట్టమనేని హీరోని చూడబోతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మహేశ్ కనిపించబోయే లుక్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

లాంగ్‌ హెయిర్‌స్టయిల్‌, గుబురు గడ్డంతో మహేశ్ ఇటీవల పలు వేడుకల్లో కనిపించాడు. అంతేకాదు ఇటీవల మహేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసినప్పటి ఫొటోలు బయటికొచ్చాయి. ఈ ఫొటోల్లో తమ హీరో హ్యాండ్‌సమ్‌గా కనిపించారని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు. అయితే జనరల్‌గా ఎస్.ఎస్‌.రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరో సదరు గెటప్‌కు మారిపోయే మేకోవర్‌లో, సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు, పబ్లిక్‌ ఫంక్షన్స్‌లో గెటప్‌ రివీల్‌ కాకుండా చూసుకోమని కోరతాడు. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక సినిమాలు చేసిన ప్రభాస్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఈ పాలసీని ఫాలో అయ్యేవారు. 

కానీ మహేశ్ మాత్రం న్యూ గెటప్‌లో ఇప్పటికే పలుసార్లు పబ్లిక్‌లో కనిపించడంతో పాటు ఫొటోలకు కూడా పోజులు ఇస్తున్నాడు. ఇదే రాజమౌళి సినిమాలో గెటప్‌ అంటూ ఆ ఫొటోలు వైరల్‌ కూడా అవుతున్నాయి. ఈ విషయంలో మహేశ్ కు రాజమౌళి ఎటువంటి ఆంక్షలు పెట్టలేదా? అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజమౌళి సినిమాలో మహేశ్ కంప్లీట్‌ లుక్‌ ఇది కాదని.. కేవలం ఇది ప్రారంభం మాత్రమేనని, మహేశ్ కంప్లీట్‌ మేకోవర్‌కు ఇంకాస్త టైమ్‌ పడుతుందని అంటున్నారు. ఏది ఏమైనా మహేశ్ లుక్‌ మాత్రం బాగుందని అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీలో వున్నారు.
Go Back to Shorts
Mahesh babu
Cinema news
Entertainment
Rajamouli
Mahesh babu latest movie

More Telugu News