Advertisement

40 కోట్లు తెచ్చిపెట్టిన 4 కోట్ల సినిమా!

Vaazha Movie Update
  • మలయాళంలో రూపొందిన 'వాజా'
  • ఆగస్టు 15న థియేటర్లకు వచ్చిన సినిమా
  • పెద్ద హిట్ కొట్టిన చిన్న సినిమా  
  • నిన్నటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

మలయాళం ఇండస్ట్రీకి ఈ ఏడాదిలో బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మొదటి ఆరు నెలలలోనే భారీ విజయాలను అందుకున్న ఇండస్ట్రీ, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. ఘన విజయాలను అందుకున్న ఇక్కడి సినిమాల జాబితాలో భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు, చాలా చిన్న సినిమాలు కూడా ఉండటం విశేషం. అలాంటి చిన్న సినిమాల జాబితాలో 'వాజా' ఒకటిగా కనిపిస్తుంది. 

'వాజా' .. 'బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్' అనేది ఉప శీర్షిక. మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించాడు. సిజూ సన్నీ .. సాఫ్ బ్రోస్ .. జోమోన్ జ్యోతిర్ .. కొట్టాయం నజీర్ .. జగదీశ్ తదితరులు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 15వ తేదీన విడుదలై, అక్కడి థియేటర్లలో సందడి చేసిన సినిమా ఇది. కేవలం 4 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 40 కోట్లకి పైగా రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి తెలుగులోను 'హాట్ స్టార్'లో అందుబాటులో ఉంది.   

విపిన్ దాస్ అందించిన కథ .. ఆ కథను ఆనంద్ మీనన్ నడిపించిన విధానం ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. 'వాజా' అంటే మలయాళంలో 'అరటి మొక్క' అని అర్థం. 'పనికిమాలిన సోమరులు' అనే అర్థంలో కూడా అక్కడ ఈ మాటను వాడుతూ ఉంటారు. అలా సోమరులైన ఓ ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది. వినోదభరితంగా సాగే ఈ కంటెంట్ తెలుగు ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసే ఛాన్స్ ఉంది. 

Advertisement
Vaazha
Siju Sunny
Joemon Jyothir
Kottayam Nazeer

More Telugu News