Mahesh Babu: మహేశ్ బాబు వెరీ లేటెస్ట్‌ న్యూలుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా!

తమ అభిమాన హీరోలను చూసినప్పుడు అభిమానులు పొందే ఆనందమే వేరు. ఇక సదరు హీరో న్యూ లుక్‌లో కనపడితే వారి సంతోషానికి హద్దే వుండదు. ఇప్పుడు మహేష్‌ న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్‌ అలాంటి అనుభూతికే లోనవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో వున్నాడు. 

అడ్వెంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇండియానా జోన్స్‌ నేపథ్యంలో వుంటుందని ఇటీవల రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మహేశ్ లుక్‌పై రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే మహేశ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి వరద బాధితుల కోసం రూ. 50 లక్షలు, ఏఎంబీ సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షల విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్‌ లోని రేవంత్ నివాసంలో ఆయనను కలిసి చెక్‌ను అందజేశారు. 

ఈ సందర్భంగా మహేశ్ తో పాటు ఆయన సతీమణి నమ్రత కూడా వున్నారు. మహేశ్, రేవంత్‌ రెడ్డిని కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో లాంగ్‌ హెయిర్‌, గడ్డం, వైట్‌ ఫుల్‌హ్యాండ్‌ టీషర్ట్‌లో కనిపిస్తున్న మహేశ్ బాబును చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ హీరో రాజమౌళి సినిమాలో ఇదే లుక్‌లో కనిపించబోతున్నాడని చర్చించుకుంటున్నారు.
Mahesh Babu
Mahesh Babu new look
Mahesh Babu latest film update
Rajamouli

More Telugu News