డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ
- నేడు ఉండవల్లి వచ్చిన టీటీడీ ఈవో శ్యామలరావు
- బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలంటూ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అనంతరం పవన్ కల్యాణ్ ను కలిసిన ఈవో
- తిరుమల లడ్డూ కల్తీపై ఆరా తీసిన పవన్
- గత పాలకమండలి తప్పిదం అని వివరించిన శ్యామలరావు
ఈ సందర్భంగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. గత పాలకమండలి హయాంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్టు ఈవో శ్యామలరావు వివరించారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను తెలియజేశారు. టీటీడీ తరఫున సంప్రోక్షణ చర్యల వివరాలను ఆయన పవన్ కు తెలియజేశారు.
కల్తీ నెయ్యి వినియోగానికి అనుమతించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను పరిరక్షించే విషయంలోనూ, ధార్మిక అంశాల అమలులోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు.