Satya: హీరో ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్న హాస్యనటుడు

The hero is a comedian who politely declines offers
షార్ట్స్‌లో చూడండి
హాస్యనటులు కథానాయకులుగా మారటం తెలుగు సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ జాబితాలో కమెడియన్‌ సత్య కూడా చేరబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో సత్య వన్‌ ఆఫ్‌ ద ట్రెండింగ్‌ కమెడియన్‌. 

అసిస్టెంట్‌ డైరెక్టర్ గా కెరీర్‌ను ప్రారంభించిన సత్య 'పిల్ల జమీందార్‌' చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత స్వామిరారా, వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌, కార్తికేయ, ఛలో, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రంగస్థలం, భీష్మ, మత్తు వదలరా, కార్తికేయ-2, హనుమాన్‌ వంటి విజయవంతమైన చిత్రాల్లో కమెడియన్‌గా నటించాడు. తనదైన అభినయంతో, ఆకట్టుకునే డైలాగ్‌ డెలివరితో బిజీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. 

తాజాగా మత్తు వదలరా-2 చిత్రంలో యేసుగా సత్య పండించిన వినోదం అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ సినిమాలో హీరో శ్రీ సింహాతో సమానంగా సత్యకు మార్కులు వేశారు. సత్య వినోదమే ఈ చిత్రానికి మేజర్‌ హైలైట్‌గా నిలిచింది. 

ఈ చిత్రం సాధించిన విజయంతో సత్య క్రేజ్‌ అమాంతం పెరిగింది. ఇప్పుడు కొంతమంది దర్శక, నిర్మాతలు సత్య ప్రధాన పాత్రలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే గతంలో కూడా సత్య హీరోగా వివాహ భోజనంబు అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమా కరోనా సమయంలో ఓటీటీలో డైరెక్ట్‌  స్ట్రీమింగ్‌ అయ్యింది. ఈ చిత్రం కూడా పూర్తి వినోదాత్మక చిత్రంగా అందరినీ అలరించింది. 

అప్పుడు కూడా సత్యకు హీరోగా ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించాడని తెలిసింది. ఇప్పుడు తాజాగా మత్తు వదలరా-2 విజయం సక్సెస్‌ తరువాత కూడా సత్య హీరోగా వచ్చిన ఆఫర్లను ఒప్పుకోవడం లేదట. 

తన ఇమేజ్‌కు సరిపోయే ప్రధాన పాత్ర అయితేనే ఓకే చెబుతున్నాడని తెలిసింది. అంతేకాని తనకు నప్పని కథలతో హీరోగా సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని అంటున్నాడట. హాస్యనటుడిగానే అందరి హీరోలతో నటిస్తూ ప్రేక్షకులను నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేయడమే తన లక్ష్యమని సన్నిహితులతో చెబుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Go Back to Shorts
Satya
satya comedian
mathu vadalara 2
Mythri movie makers
Tollywood
mathu vadalara 2 review

More Telugu News