తిరుపతిలో జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు
- తీవ్రరూపం దాల్చిన తిరుమల లడ్డూ వ్యవహారం
- ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినా జగన్ బుకాయిస్తున్నాడంటోన్న జనసేన నేతలు
- తిరుపతిలో వైసీపీ నేతల దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ ఊరేగింపు
జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతల దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ ఊరేగింపు చేపట్టారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసివారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.
కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ చెబుతున్నా జగన్ బుకాయిస్తున్నారని, ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గోవింద నామస్మరణ చేస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.