Rajinikanth: అనిరుధ్‌తో కలిసి డ్యాన్స్‌ వేసిన రజనీకాంత్‌

Rajinikanth danced with Anirudh
షార్ట్స్‌లో చూడండి
తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్‌ దర్శకత్వంలో కూలీ చిత్రంతో పాటు టి.జె. జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో 'వేట్టయాన్‌' చిత్రంలో నటిస్తున్నాడు. వీటిలో 'వేట్టయాన్‌' చిత్రం అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నయ్‌లో నిర్వహించారు‌. ఎంతో సందడిగా జరిగిన ఈ వేడుకలో రజనీకాంత్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ కలిసి వేసిన డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఆ ఫంక్షన్‌కు ఆకర్షణగా నిలిచాయి. 

ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌ మాట్లాడుతూ 'ఇది అందరికి కనెక్ట్‌ అయ్యే యూనివర్శల్ పాయింట్‌తో తీసిన సినిమా. ఏదైనా మేసేజ్‌ ఓరియెంటెడ్‌ కథతో సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌ ఈ కథను చెప్పాడు. అన్ని ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రంలో కమర్షియల్‌ అంశాలు కూడా వున్నాయి. సాధారణంగా ఇంతకు ముందు సినిమా సక్సెస్‌ కాకపోతే తదుపరి సినిమాతో తప్పకుండా హిట్‌ కొట్టాలి అనే ఒత్తిడి వుంటుంది. ఇక ఈ సినిమా నాకు ఓ విజయవంతమైన చిత్రం తరువాత వచ్చే సినిమా కావడంతో, ఇంతకు ముందు సినిమాను మించి విజయం సాధించాలి అనే టెన్షన్‌ వుంది. ప్రస్తుతం నేను అలాంటి మూమెంట్‌లోనే వున్నాను. 

నా గత చిత్రం జైలర్‌కు మించిన ప్రేక్షకాదరణ ఈ సినిమాకు వుంటుందనే నమ్మకం వుంది. ఈ సినిమాకు అనిరుధ్‌ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా వుంటుంది. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రోజే అక్టోబర్‌ 10న విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్‌ అయ్యారు. అయితే వాళ్లకు వున్న ఫైనాన్షియల్‌ టెన్షన్స్‌ కారణంగా అధికారికంగా ముందుగా ప్రకటించలేకపోయారు' అన్నారు. వేట్టయాన్‌లో నటిస్తున్న అమితాబ్ బబ్చన్‌ ఈ వేడుకకు హాజరుకాలేకపోయినా ఆయన వీడియో మేసేజ్‌ పంపారు. దాదాపు 30 సంవత్సరాల తరువాత రజనీకాంత్‌, అమితాబ్‌లు కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం.
Go Back to Shorts
Rajinikanth
Tamil superstar
Vettaiyan
Vettaiyan audio release
Vettaiyan review
Music director Anirudh
Rajinikanth latest movies

More Telugu News