Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఆర్‌టీసీ బ‌స్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు

Digital Payments in TGSRTC
Advertisement
  • త్వ‌ర‌లో టీజీఎస్ఆర్‌టీసీ బ‌స్సులో అందుబాటులోకి డిజిట‌ల్ పేమెంట్స్‌
  • టికెట్ కొనుగోలు చేసే స‌మ‌యంలో చిల్ల‌ర విష‌యంలో త‌లెత్తే స‌మ‌స్య‌కు ఇక‌పై చెక్ 
  • పైలెట్ ప్రాజెక్టుగా ఇప్ప‌టికే బండ్లగూడ‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ డిపోల్లో డిజిట‌ల్ చెల్లింపులు
  • ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో అన్ని ఆర్టీసీ బ‌స్సుల్లో డిజిట‌ల్ పేమెంట్స్ కు నిర్ణ‌యం
Advertisement
టీజీఎస్ఆర్‌టీసీ ప్ర‌యాణికుల కోసం త్వ‌ర‌లో క్యూఆర్ కోడ్ చెల్లింపుల‌ను అందుబాటులోకి తేనుంది. త‌ద్వారా టికెట్ కొనుగోలు చేసే స‌మ‌యంలో చిల్ల‌ర విష‌యంలో త‌లెత్తే స‌మ‌స్య‌కు ఇక‌పై చెక్ ప‌డ‌నుంది. ఇప్ప‌టికే బండ్లగూడ‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ డిపోలోని బ‌స్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిట‌ల్ పేమెంట్ల‌ను అమ‌లు చేయగా, ఆ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. 

దాంతో గూగుల్ పే, ఫోన్‌పే, క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌తో పాటు అన్ని ర‌కాల డిజిట‌ల్ పేమెంట్స్‌ను ఆర్‌టీసీ బ‌స్సుల్లో అనుమతించాల‌ని ఆర్‌టీసీ ఎండీ స‌జ్జ‌నార్ సూచ‌న‌ప్రాయంగా సిబ్బందికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ప్ర‌స్తుతం ఆర్‌టీసీ బ‌స్సుల్లో కండ‌క్ట‌ర్లు వినియోగిస్తున్న టిమ్ మిష‌న్ల స్థానంలో రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రికీ ఆటోమేటిక్ ఫెయిర్ క‌లెక్ష‌న్ సిస్టం మిష‌న్లు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.
Advertisement
Advertisement
TGSRTC
Digital Payments
Telangana

More Telugu News