జానీ మాస్టర్‌పై రేప్ కేసులో కీలక పరిణామం... పోక్సో చట్టం జత చేసిన పోలీసులు
- మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు
- పోక్సో సెక్షన్లు జత చేసిన పోలీసులు
- బాధితురాలి స్టేట్మెంట్ నమోదు చేసిన నార్సింగి పోలీసులు
- ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్
తాను మైనర్‌గా ఉన్నప్పుడే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని బాధిత యువతి పేర్కొంది. ఈ మేరకు ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసిన పోలీసులు, అనంతరం పోక్సోచట్టంలోని సెక్షన్లను జత చేశారని తెలుస్తోంది.
మరోవైపు, ఈ కేసులో జానీ మాస్టర్‌కు నార్సింగి పోలీసులు ఇవాళ (బుధవారం) నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు బాధితురాలి నివాసానికి కూడా వెళ్లారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి.