జానీ మాస్టర్‌పై రేప్ కేసులో కీలక పరిణామం... పోక్సో చట్టం జత చేసిన పోలీసులు

Police added POCSO Act on Johnny Master in case
  • మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు
  • పోక్సో సెక్షన్లు జత చేసిన పోలీసులు
  • బాధితురాలి స్టేట్‌మెంట్ నమోదు చేసిన నార్సింగి పోలీసులు
  • ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్
తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌‌గా పని చేస్తున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ మెడకు మరింత ఉచ్చు బిగుసుకుంది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు నేపథ్యంలో, పోలీసులు ఈ కేసులో పోక్సో చట్టాన్ని కూడా జత చేశారు. 

తాను మైనర్‌గా ఉన్నప్పుడే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని బాధిత యువతి పేర్కొంది. ఈ మేరకు ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసిన పోలీసులు, అనంతరం పోక్సోచట్టంలోని సెక్షన్లను జత చేశారని తెలుస్తోంది.

మరోవైపు, ఈ కేసులో జానీ మాస్టర్‌కు నార్సింగి పోలీసులు ఇవాళ (బుధవారం) నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు బాధితురాలి నివాసానికి కూడా వెళ్లారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి.
Go Back to Shorts
Johnny Master
POCSO Act
Tollywood

More Telugu News