ఈ వీడియో తిరుమలలో చిత్రీకరించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఏపీ పోలీస్

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • తిరుమలలో అపచారం అంటూ వీడియోపై ప్రచారం
  • ఇది ఫేక్ వీడియో అని స్పష్టం చేసిన ఏపీ పోలీస్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పట్ల ఏపీ పోలీస్ విభాగం స్పందించింది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు నాగిని మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తుండడం చూడొచ్చు. అయితే, తిరుమలలో అపచారం అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తుండడంపై ఏపీ పోలీస్ స్పష్టత ఇచ్చింది. ఇది ఫేక్ వీడియో అని పేర్కొంది.

ఇది విజయవాడలో జరిగిన పుట్టినరోజు కార్యక్రమంలో చిత్రీకరించిన వీడియో అని వెల్లడించింది. ఈ వీడియోను తిరుమలలో చిత్రీకరించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించింది. 

దివ్యమైన తిరుమల పవిత్రతను కించపరిచేలా ఫేక్ వీడియోలు పోస్ట్ చేయడం నేరం అని, సంబంధిత సెక్షన్ల కింద తీవ్రస్థాయిలో చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని పోలీస్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది.

Fake Video
Tirumala
Vijayawada
AP Police

More Telugu News