ఏపీ మంత్రి సంధ్యారాణికి త్రుటిలో తప్పిన ప్రమాదం
- విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో ప్రమాద ఘటన
- టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి వ్యానును ఢీకొట్టిన ఎస్కార్ట్ వాహనం
- ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు వ్యానులోని ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి మెంటాడ పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఎస్కార్ట్ వాహనం వెనుక మంత్రి వాహనం ఉంది. ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో మంత్రి వాహనం డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. అలాగే ఈ సమయంలో జాతీయ రహదారిపై రాకపోకలు తక్కువగా ఉన్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు.