'జీ 5' ఫ్లాట్ ఫామ్ పైకి భయపెట్టే హారర్ థ్రిల్లర్!
- సీక్వెల్ గా వచ్చిన హారర్ థ్రిల్లర్
- తమిళంలో లాభాలు రాబట్టిన సినిమా
- జీ 5 చేతికి స్ట్రీమింగ్ హక్కులంటూ టాక్
- ఈ నెలలోనే స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రచారం
ఆ సినిమాను తెలుగులో ఆగస్టు 23వ తేదీన విడుదల చేశారు. ఇక్కడి ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5' వారు దక్కించుకున్నారని టాక్. ఈ నెల 20వ తేదీన గానీ .. 27వ తేదీనగాని ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయవచ్చని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావలసి ఉంది.
డెబ్బీ - సామ్ ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఒక రోజున సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ విషయం తెలిసి డెబ్బీ షాక్ అవుతుంది. సామ్ ఎందుకు అలా చేశాడనేది ఆమెకి అర్థం కాదు. అందువలన ఆమె ఆ విషయాన్ని సామ్ ఆత్మ ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సామ్ ఆత్మ నుంచి ఆమెకి వచ్చే సమాధానం ఏమిటి? ఆ తరువాత ఆమెకి ఎదురయ్యే పరిస్థితులు ఎలాంటివి? అనేది కథ.