తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
- విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బదిలీ
- ఏసీబీ డీజగా విజయ్ కుమార్ బదిలీ
- పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేశ్ భగవత్ బదిలీ
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని, ఏసీబీ డీజీగా 1997 బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీస్ సిబ్బంది-సంక్షేమం విభాగం అదనపు డీజీగా మహేశ్ భగవత్‌కు, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేశ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. మహేశ్ భగవత్, రమేశ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.