Mokshagna: నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR wishes to Mokshagna
షార్ట్స్‌లో చూడండి
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముడికి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 'నీవు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు' అంటూ ఎక్స్ వేదికగా గ్రీటింగ్స్ తెలియజేశారు. నీ జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న తరుణంలో తాత గారితో పాటు అన్ని దైవిక శక్తుల ఆశీర్వాదాలు నీపై కురవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా కూడా తారక్ శుభాకాంక్షలు తెలిపారు. మోక్షజ్ఞ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశారు.

'హనుమాన్' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. 'సింబ ఈజ్ కమింగ్' అంటూ ఫస్ట్ లుక్ పై పేర్కొన్నారు. బాలయ్య వారసుడు హీరోగా వస్తుండటంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Mokshagna
Junior NTR
Tollywood

More Telugu News