ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఈ చుక్కలతో చత్వారం మాయం.. 15 నిమిషాల్లోనే ప్రభావం.. అత్యంత చవగ్గా అందుబాటులోకి!
- అభివృద్ధి చేసిన ముంబై సంస్థ ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్
- ‘ప్రెస్‌వు’ ఐడ్రాప్స్ పేరుతో అందుబాటులోకి
- ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మందికి ఇది శుభవార్తే
- కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాల్లోనే ప్రభావం
- కేవలం రూ. 350కే అందుబాటులోకి
ఇప్పుడీ డ్రాప్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు డీసీజీఐ తాజాగా ప్రెస్‌వు డ్రాప్స్‌కు అనుమతులు మంజూరు చేసింది.
దృష్టిదోషం ఉన్న వారిలో రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించేందుకు రూపొందించిన దేశంలోనే తొలి కంటి చుక్కలు ఇవేనని కంపెనీ పేర్కొంది. తాజాగా కంపెనీ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాలకే ప్రభావం కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రిస్కిప్షన్ ఆధారంగా మార్కెట్లో ఈ ఐడ్రాప్స్ కేవలం రూ. 350కే లభిస్తాయని కంపెనీ తెలిపింది.