వరద ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

03-09-2024 Tue 12:49 | Andhra
Advertisement
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష
  • 5 హెలికాఫ్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు తెలిపిన అధికారులు  
  • టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన ఏపీ సీఎం
Advertisement
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు మంగళవారం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారులను ఆరా తీశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాఫ్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట డ్రోన్లు, హెలికాఫ్టర్లు ఉపయోగించాలని సూచించారు. వందకు వంద శాతం ఆహార పంపిణీ జరగాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
ChandrababuFloodsAndhra PradeshRainsfood supply

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more