వరదల నేపథ్యంలో... ఏపీ ప్రభుత్వానికి వైజయంతీ మూవీస్ విరాళం
- కృష్ణా వరదలతో భారీగా నష్టం
- వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్న ప్రముఖులు, సంస్థలు
- సీఎం సహాయ నిధికి రూ.25లక్షల విరాళాన్ని ప్రకటించిన వైజయంతి మూవీస్
ఈ క్రమంలో 'ఆయ్' చిత్ర బృందం వరద బాధితులకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు సోమవారం నుండి వారాంతం వరకూ 'ఆయ్' సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్ లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరపున విరాళంగా అందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదే క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. "ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మా బాధ్యత" అని పేర్కొంది.