Chandrababu: జేసీబీపై ప్రయాణిస్తూ ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu reached flood hit areas by JCB
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కి పర్యటించారు. కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం, రామలింగేశ్వరనగర్, జక్కంపూడిలో ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో... చంద్రబాబు జేసీబీ సాయంతో పర్యటించి బాధితులను పరామర్శించారు. 

నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. 

ఓ వైపు పరామర్శలు, మరోవైపు సహాయక చర్యలను చంద్రబాబు సమాంతరంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగారు. అక్కడిక్కడే అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
Go Back to Shorts
Chandrababu
JCB
Floods
Vijayawada
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News