కరకట్ట వద్ద మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నీట మునక... ఖాళీ చేయిస్తున్న పోలీసులు

  • గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు
  • కృష్ణా నదికి పోటెత్తుతున్న వరద
  • ప్రకాశం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
  • వరద ముంపులో చిక్కుకున్న మంతెన ఆశ్రమం గ్రౌండ్ ఫ్లోర్
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులుగా ఉంది. 

ఈ నేపథ్యంలో, కరకట్ట వెంబడి వెంకటపాలెం సమీపంలో ఉన్న ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ఆశ్రమం కూడా వరద ముంపులో చిక్కుకుంది. 

ఆశ్రమం గ్రౌండ్ ఫ్లోర్ నీట మునిగింది. దాంతో పోలీసులు ముందుజాగ్రత్తగా ఆశ్రమాన్ని ఖాళీ చేయిస్తున్నారు. అందులో చికిత్స పొందుతున్న వారిని రోప్ ద్వారా బయటికి తీసుకువస్తున్నారు. వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Manthena Satyanarayana Raju
Flood
Karakatta
Krishna River
Vijayawada

More Telugu News