రేపు తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు
- తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- పలు చోట్ల జనాలు అడుగు బయట పెట్టలేని పరిస్థితి
- అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దన్న మంత్రి పొంగులేటి
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోందని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు.