నాని సినిమా ‘సరిపోదా శనివారం’ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..?
- కలెక్షన్లలో దసరా, హాయ్ నాన్న మూవీల జాబితాలో సరిపోదా శనివారం
- మూడు రోజుల్లో 50కోట్ల కలెక్షన్లు రాబట్టిందని అంటున్న సరిపోదా శనివారం మూవీ యూనిట్
- హీరో నాని 50 కోట్ల గ్రాస్ హ్యాట్రిక్ కొట్టాడని అంటున్న నిర్మాణ యూనిట్
ఈ సినిమా కలెక్షన్లు చూసి చిత్ర యూనిట్ సంతోషాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. మూడు రోజుల వసూళ్లతో కలిపి ఈ మూవీ రూ.50 కోట్ల కలెక్షన్ దాటేసిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ పక్క జోరుగా వర్షాలు కురుస్తున్నా సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ లకు తరలివస్తున్నారని సినిమా యూనిట్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ అఖండ విజయం సాధిస్తుందని నిర్మాణ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తొంది. ఈ క్రమంలో నానికి హ్యాట్రిక్ 50 కోట్ల గ్రాసర్ గా నిలిచిందని అంటున్నారు. దసరా, హాయ్ నాన్న మూవీలు కూడా రూ.50కోట్లపైగానే కలెక్షన్లు రాబట్టాయి. దీంతో ఇప్పుడు ఈ మూవీ కూడా ఆ జాబితాలో చేరడంతో నాని 50 కోట్ల గ్రాస్ హ్యాట్రిక్ కొట్టాడని టాక్ నడుస్తోంది.