ఆర్మీ ఛాపర్ తో తరలిస్తుండగా జారిపడ్డ హెలికాఫ్టర్.. వైరల్ వీడియో
- రిపేర్ కోసం ఎయిర్ లిఫ్ట్ చేస్తుండగా కేదార్ నాథ్ లో ఘటన
- తుక్కుతుక్కుగా మారిన హెలికాఫ్టర్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
కేదార్ నాథ్ కు భక్తులను తరలించేందుకు ఉపయోగిస్తున్న ఓ హెలికాఫ్టర్ గత మే నెలలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ ట్రావెల్స్ కంపెనీ సదరు హెలికాఫ్టర్ ను పక్కన పెట్టింది. తాజాగా శనివారం దానిని మరమ్మతు చేయించడానికి ఏర్పాట్లు చేసింది. ఆర్మీకి చెందిన ఎంఐ–17 ఛాపర్ తో ఈ హెలికాఫ్టర్ ను గౌచర్ కు తరలించేందుకు సిద్ధం చేసింది. కేబుల్స్ తో బిగించాక ఎంఐ 17 ఛాపర్ గాల్లోకి ఎగిరింది. దాంతో పాటు ఈ హెలికాఫ్టర్ కూడా పైకి లేచింది. కొద్దిదూరం బాగానే సాగిన ఈ ప్రయాణం.. హెలికాఫ్టర్ బరువు ఎక్కువగా ఉండడం, బలమైన గాలుల కారణంగా ఎంఐ 17 ఛాపర్ ఒడిదుడుకులకు గురైంది. దీంతో ఈ హెలికాఫ్టర్ ను గాల్లోనే వదిలేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.